గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (16:40 IST)

ప్రెగ్నెంట్‌గా ఉన్నారా? ఆకలికాకపోయినా తినాల్సిందే.. రోజూ ఐదు పండ్లు తీసుకోవాల్సిందే!

గర్భంతో ఉన్న మహిళలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీనివల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. గర్భం దాల్చినప్పటినుండి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటం వలన గర్భ సమయంలో వచ్చే ఇబ్బందులను

గర్భంతో ఉన్న మహిళలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీనివల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. గర్భం దాల్చినప్పటినుండి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటం వలన గర్భ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కొనవచ్చు. గర్భంతో ఉన్న ఆడవారు వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారి కడుపులో పెరుగుతున్న పిండం యొక్క ఆరోగ్యం, పిండ పెరుగుదలకు కావలసిన ఆహారాన్ని తీసుకోవాలి. 
 
ఒకవేళ మీరు పొగత్రాగటం, ఆల్కహాల్, నికోటిన్ వాటిని తీసుకునే అలవాట్లు ఉంటే వాటిని త్వరగా మానేయటం మంచిది. దీని వలన మీ కడుపులో పెరుగుతున్న పిండానికి ప్రమాదం జరిగి పెరుగుదల లోపాలు ఇతర లోపాలు కలుగవచ్చు. గర్భంతో ఉన్న ఆడవారు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
 
రోజువారి ఆహారంలో ఏవైనా ఐదు పండ్లను తప్పకుండా తీసుకోవాలి. మీకు ఆకలిగా అనిపించకున్నా తినడానికి ప్రయత్నించాలి. ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను రోజువారీ డైట్‌లో క్రమం తప్పుకుండా తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.