మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 22 ఏప్రియల్ 2017 (16:09 IST)

కరెంటు విషయంలో తీస్కోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఇంట్లో విద్యుత్ విషయంలో చాలామంది పెద్దగా పట్టనట్లు వ్యవహరిస్తారు. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. సాకెట్ గోడల లోపలే వుండాలి. వదులుగా వుండే తీగలకు వీటిని వ్రేలాడదీయడం క్షేమం కాదు. త్రీపిన్ ప్లగ్‌లు వాడకం మంచిది. ఎక్కువ వాట్స్ ఉపయోగించి సాకెట

ఇంట్లో విద్యుత్ విషయంలో చాలామంది పెద్దగా పట్టనట్లు వ్యవహరిస్తారు. కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. సాకెట్ గోడల లోపలే వుండాలి. వదులుగా వుండే తీగలకు వీటిని వ్రేలాడదీయడం క్షేమం కాదు. 
 
త్రీపిన్ ప్లగ్‌లు వాడకం మంచిది. ఎక్కువ వాట్స్ ఉపయోగించి సాకెట్లను ఓవర్ లోడ్ చేయకూడదు. తడి చేతులతో విద్యుత్ పరికరాలను పట్టుకోకూడదు. 
 
ఫ్యాన్, టీవీ తదితర వస్తువులను రిపేర్ చేయాల్సి వస్తే కొంతమంది విద్యుత్ వుండగానే చేయి పెట్టి చూస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాంటి పనులు చేయాలి. లేదంటే మెకానిక్ ను పిలిచి చెక్ చేయించుకోవడం మంచిది.
 
కరెంటు వైర్లు తెగినట్లు గమనిస్తే మెయిన్ ఆఫ్ చేసేసి ఆ వైర్లకు టేప్ అంటించాలి. ఇంకా పాడైపోయినవి, చెడిపోయిన పరికరాలతో కరెంటు పనులను చేసేందుకు సాహసం చేయరాదు.