గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (09:48 IST)

డయాబెటిస్‌ను నియంత్రించే చేపలు..

డయాబెటిస్‌ను నియంత్రించుకోవాలంటే.. చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. కొలెస్ట్రాల్ తక్కువ గల ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌ని కలిగివు

డయాబెటిస్‌ను నియంత్రించుకోవాలంటే.. చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. కొలెస్ట్రాల్ తక్కువ గల ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌ని కలిగివుండే చేపలను తీసుకోవాలి. సాల్మన్, ట్యునా వంటి చేపలను తినటానికి ప్రయత్నించండి. ఇంకా తృణధాన్యాలను తీసుకోండి. ఇలా సమతుల ఆహారాన్ని తినటం వల్ల శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా మామూలు స్థితిలో ఉంటాయి.
 
అలాగే స్నాక్స్‌గా బాదం పప్పుల్ని తీసుకోండి. ఇందులోని విటమిన్ ఇ, యాంటీ యాక్సిడెంట్లు కణాలను కాపాడుతాయి. నరాలకు, కంటికి మేలు చేస్తాయి. బాదంలను 33 ఏళ్లకు పైబడిన వారు రోజు నాలుగేసి తీసుకుంటే, 33 శాతం మధుమేహ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. 
 
డయాబెటిస్‌తో బాధపడేవారు పొటాటో, కార్న్, పీస్ వంటి పిండి పదార్థాలు ఉండే కూరగాయలు తీసుకోకుండా.. బ్రొకొలీ, స్పినాచ్, పుట్టగొడుగులు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఫాట్ తక్కువ వుండే పెరుగును తీసుకోవాలి. అంతేకాకుండా రోజులో ఒక 30 నిమిషముల పాటూ వ్యాయామం చేయటం మంచిది, వ్యాయామాలు చేయటం వీలు పడని పక్షంలో నడవటం లేదా జాగింగ్  చేసిన సరిపోతుంది. ఆహారాన్ని తక్కువగా తీసుకొని ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను దూరంగా వుంచవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.