శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (10:46 IST)

చికెన్, మటన్ వద్దు.. చేపలే ముద్దు.. వారానికోసారి టేస్ట్ చేస్తే..?

ఆదివారం రాగానే.. చికెన్, మటన్‌లు కొనిపెట్టేస్తున్నారా? సీఫుడ్ పక్కనబెట్టేస్తున్నారా..? అయితే ఇకపై చేపలే తినండి. వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండెకు ఎంతోమేలు జరుగుతుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్

ఆదివారం రాగానే.. చికెన్, మటన్‌లు కొనిపెట్టేస్తున్నారా? సీఫుడ్ పక్కనబెట్టేస్తున్నారా..? అయితే ఇకపై చేపలే తినండి. వారానికి రెండుసార్లు చేపలు తింటే గుండెకు ఎంతోమేలు జరుగుతుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా గుండెపోటు, పక్షవాతం రావని అనేక పరిశోధనల్లో తేలింది.
 
వారానికి కనీసం రెండుసార్లు నూనెలో వేపకుండా కూరలా వండిన చేపల కూరను వందేసి గ్రాముల చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. అలాగే సముద్ర చేపలు తింటే ఎంతో మేలని.. చిన్నారులకు వారానికోసారి చేపలను మితంగా తినిపించడం ద్వారా పెరుగుదలకు ఉపయోగపడుతుంది 
 
చేపలు తినడంతో నడుం చుట్టూ వున్న కొవ్వు కరిగిపోతుంది. కాలేయం, మెదడుకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. చేపలలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల కారణంగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.