జ్ఞాపకశక్తి పెరగాలంటే.. దంపుడు బియ్యాన్ని తీసుకోండి..
చాలామందికి జ్ఞాపకశక్తి సరిగా ఉండదు. ఏ విషయాన్నైనా ఇట్టే మరిచిపోతుంటారు. మతిమరుపుతో బాధపడే వారు మందులు వాడటం కంటే ముందు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారపదార్థాల్లో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
పొట్టు తీయని ధాన్యాలను తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. ఈ పదార్థాలు కడుపులో నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి. దీంతో మెదడుకి నిరంతర శక్తి అందుతుంది. కాబట్టి దంపుడు బియ్యం, రాగులు, సజ్జలు, జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటితో పాటు టమోటాలను కూడా తీసుకోవాలి.
టమోటాలలోని లైకోపిన్ అనే రసాయనం యాంటీ-ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఫలితంగా నాడీ కణాలు ఉత్తేజితమవుతాయి. నట్స్, గింజలు, ఆకుకూరలు, గుడ్లు, పొట్టు తీయని బియ్యం, దంపుడు బియ్యం, తృణధాన్యాలు కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.