శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 జులై 2017 (14:58 IST)

వీర్యకణాల నాణ్యతకు చేపలు.. తృణధాన్యాలు తప్పక తీసుకోవాలట..

సంతానలేమి వేధిస్తోందా..? అయితే ఆహారంలో మార్పులు చేయాల్సిందే. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా వుండాలంటే... తృణధాన్యాలు, పండ్లు, చేపలు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పీతలు, రొయ్యలు, చ

సంతానలేమి వేధిస్తోందా..? అయితే ఆహారంలో మార్పులు చేయాల్సిందే. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా వుండాలంటే... తృణధాన్యాలు, పండ్లు, చేపలు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పీతలు, రొయ్యలు, చేపలు వంటి సముద్రపు ఆహారంతోపాటు కోళ్లు, కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, వెన్నతీసిన పాలు, కొవ్వు తక్కువగా పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా వీర్యకణాల నాణ్యత పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
వీర్యకణాల నాణ్యత సోయా ఉత్పత్తులు, జున్ను, వెన్న, మద్యం, బంగాళాదుంపలు.. తియ్యని పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కోడిగుడ్లు రోజుకొకటి తీసుకోవడం ద్వారా వీర్యకణాల నాణ్యత, వృద్ధి జరుగుతుంది. పాలకూర, అరటిపండును తీసుకోవడం సంతానలేమికి చెక్ పెడుతుంది.

బనానాలోని విటమిన్ ఎ, బీ1, సీ వంటివి వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఇంకా డార్క్ చాకెట్లు, బ్రోకోలీ, దానిమ్మ, వాల్ నట్స్, గార్లిక్, జింక్ పుష్కలంగా గల బార్లీ, రెడ్ మీట్, బీన్స్ వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.