బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (20:48 IST)

అల్పాహారం తీసుకునే ముందు ఉదయం పూట తీసుకోదగ్గ పదార్థాలు

Almonds
ఉదయం వేళ అల్పాహారంగా శరీరంలో జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెపుతారు. అల్పాహారంగా దోసె, ఇడ్లీ వంటివి తీసుకుంటున్నప్పటికీ అంతకంటే ముందు వీటిని తీసుకుంటే మంచిదని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాము.
 
అల్పాహారానికి ముందు ఉదయం వేళ తినాల్సిన కొన్ని ఆహారాలు ఇవి
 
బాదంపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే వాటి పొట్టు తీసి తినండి.
 
గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగితే టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
 
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరచెంచా లెమన్ గ్రాస్ రసం తాగడం వల్ల జీర్ణ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.
 
ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే పోషకాలను పూర్తిగా గ్రహించవచ్చు.
 
వేసవి వస్తుంది కనుక ఉదయాన్నే పుచ్చకాయ తింటే అవసరమైన హైడ్రేషన్ అందుతుంది.
 
చియా గింజలు కూడా ఉదయం వేళ మేలు చేసే ఆహారంగా చెప్పబడింది.
 
గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.