శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (16:38 IST)

గ్రీన్ టీ తాగిన బాలికకు పచ్చకామెర్లు.. ఎక్కడ?

గ్రీన్ టీ తాగడం ద్వారా ఓ బాలికకు పచ్చకామెర్లు వచ్చాయని బ్రిటిష్ జర్నల్ కథనం ప్రచురించింది. టీవీ యాడ్స్ ద్వారా ఆకర్షితురాలైన ఆ బాలిక బరువు తగ్గాలనుకుంది. చైనాకు చెందిన ఓ కంపెనీ గ్రీన్ టీకి ఆర్డరిచ్చి తెప్పించుకుని.. రోజుకు మూడు కప్పుల చొప్పున మూడు నెలలుగా తాగింది. దీంతో బాలిక అస్వస్థతకు గురైంది. కడుపు నొప్పి, కండరాల నొప్పి, అలెర్జీ, కళ్లు పసుపు మారడం గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. 
 
ఆ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు పచ్చకామెర్లు వచ్చాయని తేల్చారు. అయితే గ్రీన్ టీ తాగడం మానేయగానే బాలిక మెల్ల మెల్లగా కోలుకుందని వైద్యులు వెల్లడించారు. కాగా గ్రీన్ టీ తాగడం ద్వారా అందులో యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్, అల్జీమర్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అయితే గ్రీన్ టీ తాగడం ద్వారా బాలికకు పచ్చకామెర్లు రావడంపై వైద్యులు ఏమంటున్నారంటే.. బరువు తగ్గడం కోసం గ్రీన్ టీలో అదనపు రసాయనాలు చేర్చడం ద్వారా ఇలాంటి అనారోగ్యాలు ఏర్పడుతాయని.. అందుకే గ్రీన్ టీ మోతాదుకు మించి తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు.