1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (12:06 IST)

సూప్‌ల్లో గోంగూర ఆకులు వేసి తీసుకుంటే.. పచ్చడిని తీసుకుంటే..?

సూపుల్లో గోంగూర ఆకులు వేసుకుని తీసుకుంటే.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నీరసంగా ఉన్నప్పుడు కూర, పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి లోపించినవారు గోంగూరకు ఎంత ప్

సూపుల్లో గోంగూర ఆకులు వేసుకుని తీసుకుంటే.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నీరసంగా ఉన్నప్పుడు కూర, పచ్చడి రూపంలో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి లోపించినవారు గోంగూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది. దీనిలో ఎక్కువ మెుత్తంలో సి విటమిన్ లభిస్తుంది. గోంగూరను ఆహారంలో చేర్చుకుంటే టాక్సిన్లు తొలగిపోతాయి. 
 
గోంగూరలో ఉండే పీచు గుండె కెంతో మేలు చేస్తుంది. ఇంకా శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. అలాగే గోంగూరలో పొటాషియం ఖనిజ లవణాలూ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని నియంత్రిస్తాయి. కణాలలో రక్తం సక్రమంగా విడుదలయ్యేలా చేస్తాయి. రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతుంది.
 
అదేవిధంగా గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. బీటా కెరొటిన్లు కూడా శరీరానికి అందుతాయి. ఇవి కంటిచూపుని మెరుగుపరచడానికీ, రేచీకటి వంటి సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. గోంగూరలో ఇనుము అధికంగా ఉన్నందువలన దీనిని తీసుకుంటే ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.