ఆపిల్ తొక్కే కదా అని తీసిపారేయకండి..
ఆపిల్ మాత్రమే కాదు.. ఆపిల్‌పై నుంచే తొక్క కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే. ఆపిల్ తొక్కలోనూ పోషకాలు పుష్కలంగా వున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఆపిల్‌లోని గుజ్జును మాత్రమే తింటూ తొక్కను పారేసే వారు ఇకపై అలా చేయడం ద్వారా పోషకాలను దూరం చేసుకుంటారనే చెప్పాలి.
ఆపిల్ తొక్కలో యాంటీ-యాక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ వంటివి వున్నాయి. ఇవి హృద్రోగ సమస్యలకు చెక్ పెడతాయి. ఆపిల్‌ను తొక్కతో పాటు తీసుకుంటే కంటి పొరకు సంబంధించిన రుగ్మతలు వుండవు. ఆపిల్ తొక్కలో పీచు అధికం. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ అధికం కావడాన్ని నియంత్రించి.. ఒబిసిటీని కంట్రోల్ చేస్తుంది.
ఇంకా ఆపిల్ తొక్కలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ధాతువులు పుష్కలం. అందుకే గర్భిణీ మహిళలు తప్పకుండా ఆపిల్‌ను తీసుకోవాలి. అలాగే ఆపిల్ తొక్కలోని పెక్టిన్ అనే రసాయనం శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు.