శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (22:34 IST)

నిజ వయస్సు కన్నా పదేళ్ళు తక్కువగా కనిపించాలంటే?

పెసళ్ళలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకల్లో ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా లభిస్తాయి. అందుకే వీటిని చాలామంది మొలకెత్తిన విత్తనాలను తింటుంటారు. మొలకలను ఎలా తిన్నా సరే కాలేయం, జుట్టు, కళ్లు బాగా పనిచేస్తాయట. క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండడంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుందట. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది.
 
పెసళ్ళను క్రమం తప్పకుండా తినేవాళ్ళు తమ వయస్సు కన్నా పదేళ్ళు తక్కువగా కనిపిస్తారట. ఎందుకంటే వీటిలో అధిక కాపర్ వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందట. అజీర్తి, జీర్ణవ్యవస్ధ సమస్యతో బాధపడేవారికి పెసళ్ళు మందులా పనిచేస్తాయట. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందట. ఇందులోని కాల్షియం ఎముకల పటిష్టతకు దోహదపడుతుందట. అంతే కాదు సోడియం దంతాలు, చిగుళ్ళ సమస్యలను నివారిస్తుందట.