శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 11 నవంబరు 2022 (22:48 IST)

క్యాలీఫ్లవర్‌లో పోషకాలు, ఏంటవి?

Cauliflower
క్యాలీఫ్లవర్. దీనిని తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. క్యాలీఫ్లవర్కి మసాలా దట్టించి వండితే అద్భుతమైన రుచిగా వుంటుంది. క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాము.
 
తాజా పువ్వు రసాన్ని సేవిస్తే పొట్టలో కురుపులు, దంతాలు, చిగుళ్ల నుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి.
 
క్యాలీఫ్లవర్ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
 
క్యాలీఫ్లవర్ ఆకుల రసం స్వీకరిస్తే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి. 
 
క్యాలీఫ్లవర్లో ఉండే రసాయనాలు కాలేయం పనితీరును క్రమబద్ధం చేస్తాయి.
 
క్యాలీఫ్లవర్ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి.
 
స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ బి క్యాలీఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది.
 
గర్బిణీ స్త్రీలు క్యాలీఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్‌లో కావలసిన శక్తి లభిస్తుంది.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుని సలహా కూడా తీసుకోవాలి.