బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (15:33 IST)

వేడి చపాతీల కంటే.. నిల్వ చేసిన చపాతీలే ఆరోగ్యానికి మేలు (Video)

చాలా మంది రాత్రి వేళలలో చపాతీలు ఆరగిస్తుంటారు. బాడీ వెయిట్‌ను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా రాత్రిపూట అన్నం బదులుగా చపాతీలు ఆరగించాలని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. అయితే అలా రాత్రి పూట చపాతీలు తినడం కంటే నిల్వ ఉన్న చపాతీలు తింటేనే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని నిపుణులు చెబుతున్నారు. 
 
రాత్రి పూట చపాతీలు అప్పటికప్పుడు చేసుకున్నవి కాకుండా నిల్వ ఉన్నవి తింటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఉదాహరణకు ఒకవేళ రాత్రి పూట వండిన చపాతీలు ఉదయానికి మిగిలిపోతే.. అవి పడేస్తారు… ఎందుకంటే..? ఆహారం వండిన తర్వాత 12 గంటలు నిల్వ ఉంటే అందులో ఉండే పోషకపదార్ధాలు అంతమైపోతాయి కాబట్టి. కానీ చపాతీలు, రోటీలు ఎక్కువగా నిల్వ ఉన్నవి తింటేనే మనకు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
 
ఒకవేళ రాత్రి చేసుకున్న చపాతీలు రాత్రి మిగిలిపోయి.. వాటిని ఉదయం తింటే వాటి వల్ల మన హెల్త్‌కు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయట. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఇలా రాత్రి మిగిలిపోయిన రోటీస్ పగలు తినడం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయట. 
 
అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్, అల్సర్స్, గ్యాస్ వంటి కడుపు సంబంధిత రోగాలు కూడా నయమవుతాయట. మరోవైపు రక్త హీనతతో బాధపడుతున్న వారికి కూడా చపాతీలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నిల్వ ఉన్న చపాతీలు తినడం మొదలు పెట్టండి.