బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (16:41 IST)

ప్రతిరోజూ గుడ్డును ఆహారంలో చేర్చుకుంటే?

గుడ్డులో విటమిన్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు లుటేన్ అనే పోషకం పదార్థం గుడ్డులో ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది

గుడ్డులో విటమిన్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు లుటేన్ అనే పోషకం పదార్థం గుడ్డులో ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ప్రతిరోజూ గుడ్డును ఆహారంలో చేర్చుకోవడం వలన పక్షవాతం వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.
 
ప్రతిరోజూ గుడ్డు తీసుకున్నవారిలో పక్షవాతం సమస్య 12 శాతానికి తగ్గుతుందని ఇటీవలి అధ్యయనాలలో స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 17.7 మిలియన్ల మంది కేవలం గుండె రక్తనాళాల సమస్యల మూలంగానే ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు రోజూ ఒక గుడ్డును తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.