బుధవారం, 15 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 12 డిశెంబరు 2024 (20:46 IST)

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

Tiger Nuts
టైగర్ నట్స్, పులి గింజలు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం కంటే శక్తివంతమైనవి. జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరు వినే ఉంటారు, అయితే పులి గింజల గురించి బహుశా తెలుసుకుని వుండరు. వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
టైగర్ నట్‌ రుచి బాదంపప్పులా కాకుండా కొద్దిగా కొబ్బరి రుచిలా ఉంటుంది.
పులి గింజల్లో ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి.
ఇందులో వుండే ఖనిజాలు, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
టైగర్ నట్స్ తింటుంటే వాటిలోని తక్కువ క్యాలరీ కంటెంట్ కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వీటిలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలపడతాయి.
రోజుకు కనీసం ఒకట్రెండు టైగర్ నట్స్ తినవచ్చు.