1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (09:54 IST)

శరీరంలో కొవ్వు చేరకుండా ఉండాలంటే.. టొమాటో తినండి..

శరీరంలో కొవ్వు నిల్వలు చేరకుండా ఉండాలంటే రోజూ వంటల్లో టమోటా చేర్చుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రక్తపోటుకు దూరంగా ఉండాలన్నా.. శరీరంలో కొవ్వు నిల్వలు దూరం చేసుకోవాలన్నా.. టమోటా తీసుకోవాలని

శరీరంలో కొవ్వు నిల్వలు చేరకుండా ఉండాలంటే రోజూ వంటల్లో టమోటా చేర్చుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రక్తపోటుకు దూరంగా ఉండాలన్నా.. శరీరంలో కొవ్వు నిల్వలు దూరం చేసుకోవాలన్నా.. టమోటా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. గుండెపోటును చెక్ పెట్టాలన్నా.. టమోటా తినాల్సిందే. ఎందుకంటే..? టమోటాపై ఉండే ఎరుపు రంగు పొరలో లైకోపిన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి.
 
అందుకే రోజుకి 25 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ లైకోపిన్ ఉండే ఆహారం అంటే టమోటాను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను పదిశాతం వరకు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాకుండా.. రోజుకి అరలీటరు టమోటా జ్యూస్ తాగితే.. లేదా 50 గ్రాముల టమోటా గుజ్జు తీసుకున్నా గుండె జబ్బులకు గుడ్ బై చెప్పేయొచ్చు.
 
టమోటాలను రోజువారీగా తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థను, రక్తప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఊపిరితిత్తులు, స్టొమెక్, ప్రోస్టేట్ క్యాన్సర్లను నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.