శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (12:06 IST)

ఓట్స్‌లో గ్లైపోసాట్ రసాయన అవశేషాలు.. తిన్నారంటే..?

బరువు పెరగమని.. డయాబెటిస్ వేధించదని.. అల్పాహారంలో ఓట్స్ లాగిస్తున్నారా? ఓట్స్‌తో తయారైన వంటకాలను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఉదయాన్నే ఓ కప్పు ఓట్స్‌ తింటే శరీరంలోని కొవ్

బరువు పెరగమని.. డయాబెటిస్ వేధించదని.. అల్పాహారంలో ఓట్స్ లాగిస్తున్నారా? ఓట్స్‌తో తయారైన వంటకాలను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఉదయాన్నే ఓ కప్పు ఓట్స్‌ తింటే శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుందని చాలా మంది అనుకుంటున్నారు. వైద్యులు కూడా ఓట్స్ తినమని సలహా ఇస్తారు. 
 
నిజానికి ఓట్స్‌ మంచిదే. కానీ ఓట్స్ పండించే క్రమంలో వాడే క్రిమి సంహారకాలు ఓట్స్‌లో నిల్వ ఉంటున్నాయని, అవి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌ కారకాలని తాజా అధ్యయనంలో తేలింది. మోన్‌శాంటో కంపెనీ తయారు చేసే పురుగుమందుల అవశేషాలు అనేక ఆహార పదార్థాల్లో మిగిలిపోతునట్లు పరిశోధనల్లో వెల్లడైంది. 
 
మనం తినే ఓట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్లైపోసాట్‌ అనే రసాయనం అవశేషాలు ఉన్నట్లు ప్రయోగశాలల్లో నిరూపితమైంది. ఈ గ్లైపోసాట్‌ క్యాన్సర్‌ కారకం. పైగా ఈ ప్రమాదకరమైన రసాయనం ఓట్స్‌లో చాలా ప్రమాదకర స్థాయిలో ఉందని పరిశోధనలో తేలింది. 
 
మొక్కజొన్న, సోయాబీన్స్‌ జన్యుపరంగా హెర్బిసైడ్లతో సంబంధం కలిగి వున్నప్పటికీ వృద్ధి చెందడానికి ఉపయోగించబడుతుంది. గ్లైపోసాట్‌ పంటల్లో పురుగుల్ని చంపేస్తుంది. అయితే ఈ గ్లైపోసాట్‌ రసాయనాలు వోట్స్‌లో నిల్వ వుండిపోతాయని ఇవి ప్రమాదకరమని పరిశోధనలో వెల్లడి అయ్యింది.