సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (11:21 IST)

బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధం.. హాట్ వాటర్.. ఎప్పుడు తాగాలి?

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వేడినీరు తాగండి అంటున్నారు వైద్య నిపుణులు. వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దాంతో జీవక్రియారేటూ ఇనుమడిస్తుంది. అంతేగాకుండా వేడి నీళ్లు తీ

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వేడినీరు తాగండి అంటున్నారు వైద్య నిపుణులు. వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దాంతో జీవక్రియారేటూ ఇనుమడిస్తుంది. అంతేగాకుండా వేడి నీళ్లు తీసుకోవడం ద్వారా ఆకలి అదుపులో ఉంటుంది. ఇవన్నీ బరువు నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. 
 
బరువును తగ్గించడమే కాకుండా.. సౌందర్య పోషణలోనూ వేడి నీరు బాగా పని చేస్తుంది. శరీరాన్ని తాజాగా కనిపించేలా చేయడంతోపాటు యాక్నె వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటితో చర్మం సాగేతత్వం పెరుగుతుంది. ముడతలు, పొడిచర్మం, నల్లటి వలయాలు వంటివన్నీ అదుపులో ఉంటాయి. వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
 
వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతో పాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చక్కగా జీర్ణమవుతుంది. 
 
జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారంగానూ వేడినీటిని తీసుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీళ్లు తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఉపశమనం లభిస్తుంది.