పావురాలతో జాగ్రత్త.. ఎండిన రెట్ట, రెక్కలతో ఇన్ఫెక్షన్లు..

సోమవారం, 11 డిశెంబరు 2017 (12:46 IST)

Pigeon's

పావురాల విసర్జకాలు అత్యంత ప్రమాదకరం. పావురాల ఎండిన రెట్ట నుంచి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నరు. పావురాల ఎండిన రెట్ట నుంచి ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాలిలో కలిసిపోయి.. శ్వాస ద్వారా మనుషుల్లో చేరుతాయి. అందుకే పావురాలను ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. 
 
ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారులుగా వుండిన పావురాలు.. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తున్నాయి.  హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో పావురాలు విపరీతంగా తిరుగుతున్నాయి. పావురాల జీవిత కాలం 12 సంవత్సరాలు. ఓ పావురాల జంట ఏడాదికి 18 పావురాలకు జన్మనిస్తాయి. 
 
అయితే ఈ పావురాలు వ్యాధులను మోసుకొస్తున్నాయి. వీటి రెట్ట ప్రమాదకరం. వీటి రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీల్లోకి చేరిపోతాయి. ఆ గాలిని పీల్చడం ద్వారా వ్యాధులు తప్పవు. అందుకే పావురాల రెక్కలు, రెట్టలను ముట్టుకోకూడదు. ఇలా తాకినప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా ఏ పనీ చేయకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్లు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
Diseases Pigeons Dangerous Health Air Conditioner

Loading comments ...

ఆరోగ్యం

news

తమలపాకులను తొడిమలతో తింటున్నారా?

తమలపాకులను తొడిమలతో తింటే మహిళల్లో వంధ్యత్వం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ...

news

'శృంగార టాయ్స్' కొనుగోలులో భాగ్యనగరి వాసుల అమితాసక్తి

స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక శృంగారం కంటే సెక్స్ టాయ్స్‌ ద్వారా సంతృప్తి తీర్చుకునే ...

news

ఇవి పాటిస్తే.. అనారోగ్యమనేది దరిచేరదు..

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనినైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన ...

news

గుమ్మడికాయ సూప్... గుమ్మడి ప్రయోజనాలు ఇవే...

ఇప్పటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా వుండటమనేది పెద్ద సమస్యగా మారింది. మనం ...