శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 14 మే 2018 (14:49 IST)

బెండకాయలను తినడం వల్ల జరిగే మేలు ఏమిటో తెలుసా?

బెండకాయలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల బెండకాయ ముక్కల్లో 2.5 గ్రాముల పీచు, 16.3 మిల్లీ గ్రాముల విటమిన్ సి, వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఈ బెండకాయ నీటిలో కరిగే ఒక పీచు పదార్థం వంట

బెండకాయలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల బెండకాయ ముక్కల్లో 2.5 గ్రాముల పీచు, 16.3 మిల్లీ గ్రాముల విటమిన్ సితో పాటు ఇంకా మరెన్నో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బెండకాయ నీటిలో కరిగే ఒక పీచు పదార్థం వంటిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుటకు తోడ్పడుతుంది. అదేవిధంగా గుండెజబ్బులను దూరం చేస్తుంది. 
 
బరువు తగ్గాలని అనుకునేవారు తరచుగా బెండకాయలను తినడం మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటానికి తోడ్పడుతుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
పీచు పేగులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా కూడా రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. బెండకాయ గింజల్లోని పదార్ధాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచిది. కాల్షియంను శోషించుకునేందుకు వీటిల్లోని ఇ విటమిన్ దోహదపడుతుంది.