శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (13:33 IST)

కరోనా వైరస్ ఎక్కడ ఎంతసేపు జీవిస్తుందో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ గురించే చర్చిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 195 దేశాలను కమ్మేసింది. దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఈ వైరస్ సోకగా, 27 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ మరణాలు భారత్‌లో కూడా ఉన్నాయి. అలాంటి ఈ మహమ్మారి వైరస్‌ను అంతమొందించేందుకు ఇప్పటివరకు ఒక్క దేశం కూడా విరుగుడు మందును కనిపెట్టలేకపోతోంది. అన్ని ప్రయోగశాలలు కరోనా వైరస్ విరుగుడు మందును కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో అసలు ఈ వైరస్ ఎక్కడ ఎంత జీవిస్తుందనే అంశంపై వైద్యులు స్పందిస్తూ, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరల్లో ఉండే వైరస్‌ కణాలు గాలిలో మూడు గంటల పాటు బతికి ఉంటాయి. 
 
ప్లాస్టిక్‌, స్టీల్‌, బెంచ్‌ ఉపరిలం, గాజు, స్టీలు వస్తువులపై 72 గంటల పాటు వైరస్‌ జీవించి ఉంటుంది. కార్డుబోర్డు, కాగితం, ఫ్యాబ్రిక్స్‌పై 24 గంటల పాటు చురుగ్గా పనిచేస్తుంది. 
 
అయితే సమయం గడిచే కొద్దీ వైరస్‌ ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ లోపు మనం సదరు వస్తువులను తాకినట్లయితే మనలోకి వైరస్‌ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా ఆ వైరస్ జీవితకాలం పెరుగుతూపోతుంది.