గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మనీల
Last Modified: బుధవారం, 25 సెప్టెంబరు 2019 (14:09 IST)

కంప్యూటర్‌ ముందు కూర్చొని ఎక్కవ సేపు పని చేస్తున్నారా?

నేటి తరుణంలో ఉద్యోగాలు చేసే ఎక్కువగానే ఉన్నారు. ఈ డిజిటల్ యుగంలో దాదాపు ప్రతి ఉద్యోగానికి కంప్యూటర్‌పై పనిచేయడం అనివార్యమైంది. ముందు కూర్చోవడం వలన అలసట, తలనొప్పి, కండరాల మీద ఒత్తిడి పడుతుందంటున్నారు. నిటారుగా కూర్చోవడం వలన వెన్నమొక కండరాలు మెడ, తల బరువును సపోర్ట్ చేస్తాయి. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు మెడ కండరాలు 5 కిలోల బరువును భరిస్తాయన్నమాట. 
 
అలాకాకుండా తలను 45 డిగ్రిలో ముందుకు వంచి కూర్చుంటే మెడభాగంపై అదనపు బరువు పడుతుందని చెబుతున్నారు. సరిగ్గా కూర్చోకపోవడం వలన మెడ, తలభాగం మీద 20 కిలోల అదనపు బరువు పడుతుందట. దాంతో మెడ కండరాలు పట్టేసి, వెన్నముకలో నొప్పి వస్తుంది. పరిశోధనలో భాగంగా 87 మంది విద్యార్థుల మీద పరిశోధన చేశారు. 
 
కంప్యూటర్ ముందు విద్యార్థులను మెడ, తల భాగం నిటారుగా ఉండేలా కూర్చోమన్నారు. అందర్నీ మెడలు తిప్పి, తలను ముందుకు కదిలించమన్నారు. 92 శాంత మంది తమ మెడను సులువుగా తిప్పారు. రెండు పరీక్షల్లో 125 మంది విద్యార్థులు 30 సెకన్ల సమయం తీసుకున్నారు. వీరిలో 98 శాతం మంది తల, మెడ, కళ్లు నొప్పి పుట్టాయని చెప్పారు. వారిలో 12 మంది విద్యార్థులను ఎలక్ట్రోమయోగ్రఫీ పరికరం ద్వారా పరిశీలిస్తే.. తలను ముందుకు కదిలించినప్పుడు మెడ వెనుక భాగంలో ఉండే ట్రపేజియస్ కండరం మీద ఒత్తిడి పడినట్లు గుర్తించారు పరిశోధకులు. 
 
కాబట్టి కంప్యూటర్‌పై ఎక్కువ సేపు పనిచేసేవారు తల, మెడ ఒకే పొజిషన్‌లో ఉంచి పని చేసుకోవాలి. స్క్రీన్ మీద అక్షరాల సైజును పెద్దగా చేసుకోవడం, కంప్యూటర్ రీడింగ్ అద్దాలు ధరించడం, కంప్యూటర్‌కు కళ్లకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.