ఎంత తింటున్నామనేది తెలియకుండా పొట్ట నిండా లాగించేస్తే...

గురువారం, 29 జూన్ 2017 (22:11 IST)

meals

సాధారణంగా పని ఒత్తిడిలో సమయానికి భోజనం చేయడం చాలామంది మరచిపోతుంటారు. పని ఒత్తిడి కారణంగా.. లేదా ఇతరత్రా పనులతో బిజీగా ఉండటం వల్ల భోజనం చేసే సమయం దొరకదు. ఇలాంటి సమయంలో ఆ సమయానికి అందుబాటులో ఉండే ఏదో ఒకటి తీసుకుని ఆకలిని చంపుకుంటారు. ఇలా చేయడాన్ని వైద్యులు తప్పుబడుతున్నారు. 
 
మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే... ఒక వయస్సు దాటిన తర్వాత ఓవర్ వెయిట్‌ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కొందరు వర్కవుట్స్ ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల లావు లేదా బరువు తగ్గడం అటుంచి.. నీరసం వచ్చి పడిపోవడం ఖాయమని వైద్యులు అంటున్నారు. 
 
ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రతి మనిషి నిర్ణీత వేళకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయాన్ని బలవర్థకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోమంటున్నారు న్యూట్రీషియన్లు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుందట. 
 
అలాగే, ప్రతి రోజూ మీరు తీసుకునే ఆహారాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుని, అందులో సగం తాజా కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు. ఇక మిగిలిన సగంలో ఒక పావు పప్పు దినుసులు, మరో పావు వంతు మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి. 
 
కొన్నిసార్లు దాహంగా ఉన్నా కూడా ఆకలిగా ఉన్నామనుకుని తెగ తినేస్తాం. అందుకే మీరెప్పుడు ఆకలిగా అనిపించినా ముందు ఓ గ్లాస్ వాటర్ తాగండి. దీని తర్వాత భోజనం చేస్తే తక్కువగా తినే అవకాశం ఉంది. 
 
మరికొన్ని సమయాల్లో ఒక పూట ఆహారం తీసుకోక పోయినా.. బాగా ఆకలేస్తుంది. అలాంటపుడు ఆకలేస్తుంది కదా అని గబగబా తినేస్తాం. దీనివల్ల ఎంత తింటున్నామనేది తెలియదు. నెమ్మదిగా, బాగా నమిలి తినాలి.
 
అలాగే, రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీరు తాగాని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతానికి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టైమ్‌లో స్నాక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తక్కువ కేలరీస్ ఉన్న బాదాం లాంటివి తీసుకుంటే మరీ మంచిది. 
 
ముఖ్యంగా ఇంట్లో కాకుండా బయట ఆహారం తీసుకుంటే.. ముందు ఫ్రూట్ సలాడ్ కానీ, ఏదైనా సూప్‌గానీ తీసుకోవాలి. ఆ తర్వాతే భోజనం చేయాలి. దీనివల్ల హై కేలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. భోజనం తర్వాత ఐస్‌క్రీమ్, కేక్ లేదా పాయసం వంటివి దూరంగా ఉంచితే మంచిది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ 2 గ్రాముల ఆవాలు మింగితే...?

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు వుంటాయి. వాటిలో నల్ల ఆవాలు కూడా ఒకటి. ఇవి ...

news

యోగా డేంజరట.. పరిశోధన

ప్రపంచ యోగాదినోత్సవం ఇటీవలే ముగిసింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ...

news

తిన్న వెంటనే ఇది చేస్తున్నారా.. ఇక మీ పని అంతే..!

మనం చేసే పనులలో బాగా ఇష్టపడి చేసే పని భోజనం చేయడం. మనం ఎంత కష్టపడినా సరైన భోజనం చేస్తే ...

news

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. రోజూ ఓ కప్పు చేపలు తినాల్సిందే

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ...