శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 23 జనవరి 2016 (11:38 IST)

నిద్రపోతూ బరువు తగ్గొచ్చా? తాజా అధ్యయనాలు ఏం చెపుతున్నాయి?

సాధారణంగా నిద్రపోతే.. బరువు పెరుగుతారు. కానీ, తాజా అధ్యయనాల్లో మాత్రం బరువు తగ్గుతారని చెబుతూనే.. దానికి గల కారణాలను కూడా వివరించాయి. పొట్టలోని మిత్రకారక బ్యాక్టీరియాలు ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అవి రాత్రిపూట చైతన్యవంతంగా ఉంటాయి కాబట్టి రాత్రిపూట చక్కని నిద్ర అవసరమని దీనివల్ల బరువు తగ్గించుకునే ప్రక్రియను 50 శాతం వేగం వంతం చేయొచ్చని ఓవా విశ్వవిద్యాలయ అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
అయితే, బరువు తగ్గాంటే మనం కొన్ని నిబంధనలు కూడా పాటించాలి. ముఖ్యంగా పాటించాల్సిన నిబంధన ఏంటంటే రాత్రి భోజనాన్ని వేళపట్టున త్వరగా తినేయాలి. భోజనానికి, నిద్రకు ఉపక్రమించడానికీ మధ్య ఎక్కువ సేపు విరామం ఉండాలి. అలాగే రాత్రివేళ తీసుకోవలసిన ఆహారంలో ఈ మార్పులు చేసుకోవాలి. 
 
ఆహారంలో కొద్దిగా మాంసాన్ని చేర్చుకున్నా తప్పులేదట. ఎందుకంటే మాంసంలోని ట్రిఫ్టోపాన్‌ అనే రసాయనం గాఢ నిద్రకు కారణమై.... బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుందట. అలాగే కారం.... అందులోనూ తాజా పచ్చిమిర్చి కారం చేరితే కొవ్వు వేగంగా కరుగుతుంది. నిజానికి నిద్రపోయే ముందు ప్రొటీన్లు తింటే అరగదని తెలుసు. 
 
కానీ కొద్దిగా అంటే 30 గ్రాముల వరకూ ప్రొటీన్లు చేర్చుకుంటే జీవప్రక్రియ చక్కగా జరుగుతుంది. వీటితోపాటూ గుప్పెడు పుదీనా ఆకులని దిండు కింద పెట్టుకోవడం కానీ, రెండు చుక్కల పుదీనా నూనెని వాసన చూడ్డం కానీ చేసినా కొవ్వు వేగంగా కరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.