శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (14:44 IST)

దోమలు ఎక్కువగా ఎవరిని కుడుతాయో తెలుసా..?

దోమలు కనిపించని ప్రాంతం అంటూ ఏదీ ఉండదు. ముఖ్యంగా ఈ చలికాలం వచ్చిందంటే చాలు దోమల బెడద అధికంగా ఉంటుంది. దీంతో దోమలు పదేపదే కుడుతుంటాయి. అసలు ఈ దోమలు ఎందుకు కుడుతాయనే విషయాన్ని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం...
 
చర్మం నుండి వెలువడే రసాయనాలు, చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు దోమలు విపరీతంగా ఆకర్షితులవుతాయి. ప్రధానంగా ఆడదోమలు కార్బన్‌డయాక్సైడ్ ఉండే వాతావరణాన్నే ఇష్టపడుతాయి. ముఖ్యంగా గర్భిణులను దోమలు కుట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతాయట. సాధారణ మహిళల కంటే గర్భిణులు విడిచే శ్వాసలో 21 శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణులను కుడుతాయని పరిశోధనలో తేల్చి చెప్పారు. 
 
శారీరకంగా కష్టపడినపుడు లాక్టిక్ ఆమ్లం, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు మన చర్మం నుండి విదులవుతాయి. అందుకే చెమట పట్టిన దేహాలను దోమలు కుట్టడానికి ఇష్టపడుతాయి. ఏ, బి రక్త గ్రూపులతో పోలిస్తే ఒక గ్రూప్ రక్తాన్ని దోమలు రెండు రెట్లు అధికంగా ఇష్టపడుతాయి. మగదోమలు పువ్వులు, తేనెపై ఆధారపడితే ఆడదోమలు మనుష్యుల రక్తాన్ని తాగడానికి ఇష్టపడుతాయి.