ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?

శుక్రవారం, 14 జులై 2017 (17:37 IST)

రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఆకుకూరల ద్వారా అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో కెలోరీలు, కొవ్వు తక్కువ. అయితే ఈ ఆకుకూరలను వండేటప్పుడు రెండు మూడుసార్లు కడగాలి. ఎందుకంటే.. చిన్న పురుగులు, దుమ్ము, వంటివి తొలగిపోతాయి. 
 
కడిగేటప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయడం ద్వారా క్రిములు చనిపోతాయి. అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూతలు పెట్టి వండటం ద్వారా మనకు పూర్తి పోషకాలు లభిస్తాయి. వీలైనంతవరకు కుక్కర్లో వండటం మంచిది. ఆకుకూరలు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 
ఆకుకూరల్లో రోజుకో రకం బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. 
 
పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి వంటి వెరైటీలుగా ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యాల్షియం, విటమిన్‌ ‘ఎ', ‘సి', ఇనుము, ఫోలిక్ యాసిడ్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Calories Fat Cooker Spinach Palak Drumstic Leaves Leafy Greens

Loading comments ...

ఆరోగ్యం

news

అల్పాహారం కడుపు నిండా తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదట..

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు ...

news

వానాకాలంలో బెండ తినొచ్చు.. ఆస్తమాకు దివ్యౌషధం..

బెండకాయను అన్నీ సీజన్లు తినొచ్చు. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా రోగులకు బెండకాయ దివ్యౌషధంగా ...

news

సన్నబడాలనుకునేవారు.. డ్రైఫ్రూట్స్‌తో పాటు బ్రౌన్ రైస్ తీసుకోండి..

సన్నబడాలనుకునేవారు తీసుకునే పదార్థాల్లో అసలు ఫాట్ లేకుండా చూసుకోవాలి. అయితే శరీర ...

news

పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి...?

శిశువు పుట్టిన వెంటనే బి.పి.జి. ఒక మోతాదు. శిశువు పుట్టిన 6 వారాలకు డి.టి. పి. పోలియో ఒక ...