శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (10:07 IST)

జ్వరము వచ్చిన వారిలో...?

వాత రోగములు కలిగినపుడు రోగులకు నాలుక చల్లగానూ, గరుకుగానూ, పగుళ్ళు కలిగి ఉంటుంది. పిత్త రోగములు కలిగినపుడు నాలుక బాగా ఎర్రగా ఉంటుంది. కఫరోగములు కలిగినపుడు నాలుక పాలిపోయినట్లు, జిగట గానూ ఉంటుంది. నాలుక మిశ్రమ రంగుల కలిగివున్నచో మిశ్రమ వ్యాధులు ఉన్నట్లు తెసుకోవాలి. 
 
జ్వరము వచ్చిన వారిలో నాలుక ముదురు ఎరుపుగా మారుతుంది. ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు, తడారిపోవడం జరుగుతుంది. వాత రోగాలు కలిగినప్పుడు కళ్ళు పొగరంగు కలిగి చంచలముగా, మంటగా ఉంటాయి. పిత్త వ్యాధులు కలిగినపుడు కళ్ళు దీపపు కాంతిని కూడా చూడలేక మంటగా పచ్చబడుతున్నట్లు ఉంటాయి. కఫ రోగాలు కలిగినపుడు కళ్ళు జిడ్డుగా, నీళ్ళూరూతూ కళావిహీనమై ఉంటాయి. 
 
మనిషి యొక్క దృష్టి, చెవులు, చర్మం సరిగావుంటే.. వ్యాధి నివారణకు వాడు ఔషధములు త్వరగా పనిచేసి వ్యాధి నివారణగును. పాదాలు వెచ్చగా ఉండి, నాలుక మృదువుగానున్న వ్యాధులు త్వరగా నివారణమవుతాయి. జ్వరం నందు చెమట కలుగకుండా, ఊపిరికి అంతరాయము లేకుండా.. గొంతులో కఫం లేకుండా ఉంటే.. వ్యాధులు త్వరగా నయమగును.