శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (14:48 IST)

నిద్రలేమికి ఇలా చేయాల్సిందే..?

చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే.. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యల నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎలాంటి లాభాలు కనిపించవు. మరి ఈ నిద్రలేమికి చెక్ పెట్టాలంటే ఇలా చేయాల్సిందే..
 
1. రోజూ నిద్రకు ముందుగా టీ, కాఫీ వంటివి తీసుకోరాదు. వాటికి బదులుగా గ్లాస్ పాలలో 2 స్పూన్ల తేనె, కొద్దిగా పసుపు కలిపి సేవిస్తే అరగంట తరువాత నిద్రకు ఉపక్రమిస్తే చక్కని నిద్రపడుతుంది. 
 
2. రోజూ రాత్రి చేసే భోజనం చేసిన తర్వాత నిద్రకు కనీసం 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే చక్కని నిద్ర పడుతుంది. 
 
3. మీరు నిద్రించే రూమ్‌లో సువాసన వెదజల్లె పువ్వులను ఫ్లవర్ వేజ్‌లను పెట్టుకోవాలి. దీంతో గది మెుత్తం మంచి వాసన వస్తుంది. ఆ సువాసనల్లో మైమరచిపోతూ సులభంగా నిద్రపోవచ్చు. 
 
4. ముఖ్యంగా నిద్రించే సమయం ఒకేవిధంగా ఉండాలి. ఒకే సమయంలో లేవాలి. అప్పుడే జీవనశైలి సరిగ్గా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుండి బయటపడొచ్చు. 
 
5. రాత్రివేళ భోజనం చేసిన తరువాత 10 లేదా 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినప్పుడు మససు ప్రశాంతంగా, రిలీఫ్‌గా ఉంటుంది. దాంతో చక్కగా నిద్ర పడుతుంది. ఎక్కువగా ఆలోచిస్తే కూడా నిద్ర సరిగ్గా రాదు. కనుక ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపోవాలి.