దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయాల్సిందే..?
చాలామంది నిద్రలేవగానే కాఫీ, టీ తెగ తాగేస్తుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. అందువలన ఉదయం నిద్రలేవగానే దంతాలు శుభ్రం చేసిన తరువాతనే కాఫీ, పాలు, టీ మరేదైనా సేవించాలి. మీరు దంతాలు శుభ్రం చేసేందుకు వినియోగించే బ్రష్ సుతిమెత్తనిదై ఉండాలి.
ఒక వేళ మీరు వాడే బ్రష్ గరుకుగా లేదా కాస్త గట్టిదైతే దానిని కాసేపు వేడి నీటిలో ముంచి ఆ తరువాత బ్రష్ చేయాలి. లేదంటే దంతాలు నుండి రక్తం వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు నిపుణులు.
ప్రతి రోజు ఆహారం తిన్న తరువాత మీ దంతాలను హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో శుభ్రపరచాలి. దీంతో మీ దంతాలలోనున్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతాయి. దాంతో దంతాలు మరింత అందంగా తయారవుతాయి. కానీ మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో నోటిని శుభ్రపరిచే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోను మింగకూడదు. దీనిని నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేయాలంటున్నారు వైద్యులు.
వీలైనంత వరకు చక్కెరను తక్కువగా ఉపయోగించాలి. చక్కెర ఎక్కువగా తీసుకుంటే అది నోటిలోని దంతాలను పాడు చేయడమే కాకుండా బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. అదే విధంగా చాక్లెట్స్ కూడా దంతాలను పాడుచేస్తాయి. వీటికి బదులుగా బాదంపప్పులు, ఎండు ద్రాక్షలను సేవించండి మంచి ఉపశమనం లభిస్తుంది.
దంతాలను శుభ్రం చేసిన తరువాత మీ నోట్లోని నాలుకను కూడా శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రపరచుకోండి. ప్రతి రోజు ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేయాలంటున్నారు వైద్యులు.