శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:22 IST)

మీ ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే....

అనీమియా. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అనీమియాను అధిగమించం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఉన్న వస్తువులతో అనీమియా నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు వున్నాయంటున్నారు. ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి.
 
అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి. అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. బీట్రూట్ ముక్కలుగా చేసుకుని జ్యూస్ చేసుకుని తాగాలి. పాలకూర, కొత్తిమీర రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి కనుక వాటిని కూడా తీసుకుంటుండాలి.