సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 24 నవంబరు 2023 (14:07 IST)

కళ్ల నుంచి ఆవిర్లు, వేడి చేసిందా? ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం

Milk
వేడి చేసిందని చాలామంది చెపుతుంటారు. కొంతమందికి శరీరం వేడిగానూ, కళ్ల నుంచి వేడి ఆవిర్లు వస్తాయి. అలా వచ్చిన శరీరంలో వేడిని తగ్గించుకునేందుకు కొన్ని పదార్థాలు, పానీయాలు తీసుకుంటుంటే చల్లబడుతుంది. అవేమిటో తెలుసుకుందాము.  గోరువెచ్చని పాలలో కాస్తంత తేనె కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. పాలలో గసగసాల పొడిని కలుపుకుని తాగినా ఫలితం వుంటుంది.
 
పుచ్చకాయ తింటే శరీరంలో వున్న వేడి తగ్గిపోతుంది. ఉదయాన్నే దానిమ్మ రసం తాగితే శరీరంలో వున్న వేడి మాయమవుతుంది. రోజూ రెండుసార్లు కొబ్బరినీళ్లు తాగుతుంటే ఫలితం వుంటుంది. ఆహారం తీసుకునేటపుడు టీ స్పూన్ మెంతులు తిన్నా కూడా శరీరంలో వేడి తగ్గుతుంది.