మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (17:23 IST)

తలనొప్పి తగ్గాలంటే.. ఏం చేయాలి..?

ఇప్పుడు ఎక్కడి చూసినా అందరు తలనొప్పి తలనొప్పి అంటూ బాధపడుతున్నారు. ఈ కాలంలో తలనొప్పి వచ్చేందుకు ఎన్ని కారణాలున్నా ఆ నొప్పి వచ్చిందంటే.. దానిని తగ్గించడానికి ఏవేవో మందులు, మెడిసిన్స్ వాడుతుంటారు. సాధారణంగా చాలామంది స్తీలు బయటగల మందలు వాడుతుంటారు. వీటిని వాడడం అంత మంచిది కాదని చెప్తున్నారు.  ఈ నొప్పిని తగ్గించాలంటే.. ఇంట్లోని సహజ సిద్ధమైన పదార్థాలతో తగ్గించవచ్చును.. మరి అవేంటో పరిశీలిద్దాం..
 
తలనొప్పి వచ్చిందంటే.. మెుదటగా మీరు చేయాల్సింది.. గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడమే. ఈ నీళ్లల్లోని పోషకాలు నొప్పిని తగ్గించుటకు మంచి మెడిసిన్‌లా ఉపయోగపడుతాయి. ఒక్కోసారి రక్తప్రసరణ జరగని సమయంతో కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. కనుక ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్థాలలో పండ్లు, ఇతర కూరగాయలు తింటే ఫలితం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. బకెట్ వేనీళ్లలో కొద్దిగా ఆవాల పొడి కలిపి ఆ నీటిలో పాదాలను ఉంచితే రక్తప్రసరణ బాగా జరిగి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మసౌందర్యానికి ఎంత మంచిదో.. తలనొప్పికి కూడా అలానే పనిచేస్తుంది. ఎలానో చూద్దాం.. కప్పు వేనీళ్లలో 3 స్పూన్ల్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఈ నీటిని తాగిన 10 నిమిషాల వరకు ఇతర పదార్థాలేవి భుజించకూడదు. ఇలా క్రమంగా చేయడం వలన తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. 
 
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి తలనొప్పి నియంత్రణకు ఉపయోగపడుతాయి. గ్రీన్ టీలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది. వేపాకులను పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని నుదిటిపై రాసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే నొప్పి తగ్గుతుంది.