బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (13:16 IST)

చెమటను తరిమికొట్టాలంటే.. ఇలా చేయండి

చెమటను దూరం చేసుకోవాలంటే.. బ్యాక్టీరియాను తొలగించడం ముఖ్యం. మసాలా వంటకాలను పక్కనబెట్టాలి. ప్రాసెస్ ఫుడ్, వెల్లుల్లి, ఉల్లి, క్యాబేజీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. కీరదోస, క్యారెట్ క్యాప్సికం, ఉడికించిన

చెమటను దూరం చేసుకోవాలంటే.. బ్యాక్టీరియాను తొలగించడం ముఖ్యం. మసాలా వంటకాలను పక్కనబెట్టాలి. ప్రాసెస్ ఫుడ్, వెల్లుల్లి, ఉల్లి, క్యాబేజీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. కీరదోస, క్యారెట్ క్యాప్సికం, ఉడికించిన కోడిగుడ్లు, కూరగాయలు తీసుకోవాలి. కోడి, వేటమాంసం తీసుకోకుండా చేపలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం వుంటుంది. 
 
రాత్రి నిద్రపోయే ముందు యాంటీపెరిస్పిరెంట్ డియోండ్రెంట్‌ను వాడితే చెమట తగ్గుతుంది. దుస్తులు శుభ్రం చేసేటప్పుడు వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించాలి. వాషింగ్ మెషీన్‌లో వెనిగర్ వేసి స్విచ్చాన్ చేయాలి. కొద్ది సేపటి తర్వాత అందులో బేకింగ్ సోడా వేసి శుభ్రం చేయాలి. 
 
బహుమూలాల్లో వెంట్రుకల్ని తొలగించాలి. బహుమూలాల్లో తేయాకు నూనెను రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. తేయాకు నూనెను రెండు స్పూన్ల నీటిలో కలిపి రాసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులను వాడాలి. ఇలా చేస్తే చెమటను దూరం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.