టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? మాత్ర చేదుగా వుందనీ...

శుక్రవారం, 7 జులై 2017 (14:52 IST)

tablets

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి చేసుకున్న అలవాట్లు రీత్యా కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు లేదా నీళ్ళు వాడుతుంటారు. అయితే వీటన్నింటిల్లో నీళ్ళతో మాత్రం తీసుకోవడం క్షేమకరమని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్ళు కాక ఇతర ద్రవపదార్ధాలు వాడటం మాత్రలు చేసే ప్రక్రియ భంగం కలిగిస్తాయని వారు చెపుతున్నారు. 
 
కాఫీ, టీలతో మాత్రల్ని తీసుకుంటే పలు సమస్యలను మనకు మనమే ఆహ్వానించినట్లు అవుతుందంటున్నారు. ఎందుకంటే ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్‌ దెబ్బతీస్తుంది. పైగా సైడ్‌ ఎఫెక్టులు అధికం కావచ్చు. అంతేకాదు కెఫీన్‌ కడుపులో మంటను పెంచుతుంది. పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. 
 
మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, లేదా కాయగూరల రసాలతో మాత్రలు తీసుకుంటే కొన్ని మందుల ప్రభావం తగ్గిపోతుంది. ద్రాక్షరసం తీసుకుంటే అందులోని ఎంజైమ్స్‌లు కొన్ని మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. గుండె జబ్బులకు ఉపయోగించే కొన్ని రకాల మందులు, యాంటీ ఫంగల్‌ మందులు పనిచేయక పోగా సైడ్‌ ఎఫెక్టులకు దారి తీయొచ్చని చెపుతున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కడుపుకి నిత్యం ఇవి పట్టిస్తుంటే ఇక సుఖనిద్ర ఎలా వస్తుంది నాయనా?

నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో ...

news

ఆహ్, అబ్బో, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి పోయేందుకు అదే మార్గం

సాధారణంగా నిత్యం ఎంతో బిజీగా గడిపే మహిళామణులు శృంగారం దగ్గరకి వచ్చేసరికి అక్కడ నొప్పి.. ...

news

పచ్చటి గార్డెన్‌ మెత్తటి గడ్డిపై వ్యాయామం చేస్తే ఏమవుతుంది?

అడవుల నరికివేత ఎక్కువై ప్రాణవాయువు తక్కువవుతున్న తరుణంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమతమ ఇంటి ...

news

ఉప్పు పెరిగితే బీపీ వస్తుంది... మరి తగ్గితే ఏమొస్తుందో తెలుసా?

ఉప్పు పేరు చెబితే బీపీ వున్నవారికి బీపీ పెరిగిపోతుంది. నాలుకకు కాస్త ఉప్పు తగిలినా ఆ ...