బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:46 IST)

చిన్నారులు అస్తమానం వీడియో గేమ్స్ ఆడుతున్నారా..?

చిన్నారులు అస్తమానం వీడియో గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను మందలిస్తుంటారు. అసలు విషయం చెప్పాలంటే వీడియోగేమ్స్ ఆడడం ఆరోగ్యానికి మంచిదేనట. ఈ గేమ్స్ ఆడడం వలన గుండెకు మంచి వ్యాయామం జర

చిన్నారులు అస్తమానం వీడియో గేమ్స్ ఎందుకు ఆడుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను మందలిస్తుంటారు. అసలు విషయం చెప్పాలంటే వీడియోగేమ్స్ ఆడడం ఆరోగ్యానికి మంచిదేనట. ఈ గేమ్స్ ఆడడం వలన గుండెకు మంచి వ్యాయామం జరుగుతుందని పరిశోధనలలో తెలియజేశారు.
 
అమెరికాలోని యూనివర్సిటీ ఆప్ టెక్సా‌స్‌కు చెందిన శాస్త్రవేత్త కవిత రాధాకృష్ణన్, పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుండగా వారి గుండె పనితీరును పరిశీలించారు. అప్పుడు రక్తసరఫరా బాగా జరిగినట్లు తెలిసిందట. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని, హృద్రోగాలు రావని పరిశోధనలో వెల్లడైంది. 
 
వీడియో గేమ్స్ గుండెకు మంచి వ్యాయామమని వీటిని ఆడడం వలన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే వీడియో గేమ్స్ ఆడడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి అదే పనిగా వీడియో గేమ్స్ ఆడితే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.