శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2019 (20:48 IST)

కొవ్వు పెరిగితే మగవారిలో ఆ సమస్య ఖాయం...

కొవ్వు శాతం అధికంగా కలిగిన పదార్ధాలను తినడం వల్ల పురుషులలో వీర్యకణాల ఉత్పత్తి క్షీణిస్తుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి, యువకులు కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇస్తున్నారు. నేటి యువతరంలో ముఖ్యంగా తలెత్తుతున్న సమస్య సంతాన లేమి. అందుకు ఆహారపు అలవాట్లు కూడా ఒక ముఖ్య కారణం.
 
కొవ్వు పదార్ధాలు
శరీర ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల గురించి పరిశోధన చేసినపుడు హోటళ్ళలో లభించే ఆహార పదార్ధాలు, కొవ్వు అధికంగా ఉండే రుచికరమైన పదార్ధాలు సేవించడం వల్లే యువకులలో వీర్యకణాల ఉత్పత్తి క్షీణిస్తోందని నిరూపణ అయ్యిందని పరిశోధకులు తెలిపారు. 35 శాతం మంది యువకులలో ఇటువంటి పొరపాట్ల వల్లే సంతానలేమి ఏర్పడుతోందని పరిశోధకులు తెలిపారు.
 
అదేవిధంగా అధికంగా ధూమపానం చేయడం, మద్యం సేవించడం, మానసిక ఒత్తిడి మొదలైనవి కూడా వీర్యకణాల ఉత్పత్తి లోపానికి కారణమవుతున్నాయని పరిశోధనలో తేలింది. అదేవిధంగా "ఒమేగా 3" కొవ్వు నిల్వలు కలిగి ఉన్న ఆహార పదార్ధాలను సేవించిన పురుషులకు వీర్యకణాల ఉత్పత్తిలో లోపమేమీ ఏర్పడలేదని కూడా పరిశోధనలో తేలింది. పురుషుల లోపాలను పోగొట్టేందుకు మన పూర్వీకులు సిద్ధ వైద్యంలో ఒక మార్గం తెలిపారు. దానిని అనుసరిస్తే, వీర్య కణాల లోపం నివారించబడి మంచి ఫలితాలు ఏర్పడతాయని తెలిసింది.
 
వీర్యకణాల ఉత్పత్తి వృద్ధి చెందేందుకు జాజికాయ:
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, కామ వాంఛని పెంచుతుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధిచేస్తుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడి చేసి ఉంచుకోండి. ఆ చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలలో కలిపి తాగాలి. ఇది నపుంసకత్వాన్ని తరిమికొడుతుంది. నరాల బలహీనతని పోగొడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.