రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే..?
ప్రకృతి జీవులన్నింటికీ నిద్ర అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. ఈ కారణంగానే యోగులు, మునులు, మహాపురుషులు అధిక సమయం ధ్యానం అనబడె ఒక రకమైన నిద్ర లేదా విశ్రాంతి స్థితిలో గడుపుతారు. ఇందువలే వారు ఎక్కువ కాలం జీవిస్తారు. యోగశాస్త్రం ప్రకారం మనిషికి నిద్రపట్టడం లేదంటే.. అతడు తనకు తెలియకుండానే అత్యంత నేరుగా వృద్ధాప్యంలోకి పయనిస్తున్నట్లు లెక్క.
నిజానికి నిద్ర అంటే శరీరం తెలియకుండా పడుకోవడమేనని చాలామంది అభిప్రాయం. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే నిద్రలోనే శరీరం ఎంతో పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. రుజువు చేసిన శాస్త్రీయ సత్యం. నిద్రలో మన శరీరంలోని కణజాలాలూ, వ్యవస్థలు అనేక పనులు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను, విషపదార్థాలను తొలగించడం, చెడిపోయిన కణాలను మరమ్మత్తు చేయడం అనేవి వాటిలో కొన్ని.
మనం మెలకువగా ఉన్నప్పుడు శరీరం ఈ పనులను సక్రమంగా నిర్వర్తించలేదు. నిద్రలేమికి యోగా పలురకాలను సూచిస్తుంది. వాటిని పాటించడం వలన సుఖనిద్రను సొంతం చేసుకోవచ్చును. నిద్ర సరిగ్గా పట్టకపోవడాన్ని ఇన్‌సోమ్నియా అంటారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. కొందరికి బెడ్ పైకి వెళ్లాక ఎంతకూ నిద్ర రాదు. చాలామందికి బాగా నిద్రపోవాలని ఉంటుంది. కంటినిండా నిద్రపోవాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
తిన్న వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నించకూడదు. రాత్రివేళ భోజనానికి, నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే తేలిగ్గా నిద్ర పడుతుంది. పడుకునే ముందు పాలు తాగితే కచ్చితంగా వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. పాలలో మెలటొనిన్ అనే ఆమ్లం నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. అందువలన బాగా నిద్రపోవాలంటే పాలు తాగడం మరిచిపోవద్దు.