సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 30 మే 2024 (22:55 IST)

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

వేసవి ఎండలు ముదిరిపోయాయి. దేశంలో దాదాపు ఎక్కడ చూసినా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సూర్యుడు భగభగమంటూ భూమిపైకి కిరణాలు పంపుతున్నాడు. ఈ వాతావరణంలో శరీరాన్ని చల్లగా వుంచుతూ ఆరోగ్యంగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్థాలను తింటుండాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
90 శాతం నీరున్న కీరదోస, దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువున్న పుచ్చకాయలు వేసవిలో గొప్ప ఆహారంగా చెప్పబడింది.
కివీ పండులోని ఎలక్ట్రోలైట్స్ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్‌లతో సమృద్ధిగా ఉండే పవర్ డ్రింక్, వేసవిలో రోజంతా హైడ్రేటెడ్, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
అవోకాడో మోనో-సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటుంది, ఇది రక్తం నుండి వేడి, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతుంది.
పుదీనా కూలింగ్ హెర్బ్ కనుక పుదీనా నీరు తాగుతుండాలి.