1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:12 IST)

అనారోగ్యాన్ని తెచ్చే అలవాట్లు... ఏంటవి?

ఆరోగ్యానికి ఇది చేయండి అది చేయండి అంటుంటారు. కానీ అసలు అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు ఏమిటో తెలుసా? అవేమిటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజూ స్నానం చేయకుండా వుండేవారికి అనారోగ్యం నీడలా వెన్నంటి వుంటుంది.
 
ఇంకా క్రమబద్ధం కాని భోజనం... అంటే రోజు ఒకేవేళలో భుజించకుండా వుండటమన్నమాట. అధిక ఉపవాసం, బజారులో దొరికే చిరుతిళ్లు, చల్లని పానీయాలు, పరిశుద్ధం చేయనటువంటి నీళ్లు తాగటం, ఎక్కువగా పులిసిన పదార్థాలు తినడం చేస్తే అనారోగ్యం కలుగుతుంది.
 
అలాగే వ్యాయామం తగినంత చేయకపోవడం, అతి బ్రహ్మచర్యము లేదా అతి సంభోగము, పగటివేళ నిద్ర, సరిగా దంతధావనం చేయకపోవడం, నాలుకపై వున్న పాచిని తొలగించకపోవడం, అతిగా తిరగడం వంటివి సమస్యను తెస్తాయి.
 
ఊక, కిరోసిన్, పెట్రోలు, డీజిల్, తారు, పొగాకు వంటి వాటి నుంచి వచ్చే పొగను పీల్చడం, కుళ్లిపోయిన కూరలు, మాంసం, పళ్లు సేవించడం, మురుగు కాల్వలకు సమీపంలో వుండటం, వస్త్రాలను బాగా బిగుతుగా ధరించడం, పరిశుభ్రమైన దుస్తులను ధరించకపోవడం, ఆకు కూరలు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, విపరీతంగా ఆందోళన చెందటం ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కనుక పైన పేర్కొనబడిన అలవాట్లను వదిలించుకుంటే అనారోగ్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు.