ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (20:29 IST)

ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా..? ఇవి తప్పదండోయ్! (Video)

Noodles
ఇన్‌స్టంట్ నూడుల్స్ తింటున్నారా.. అయితే ఇకపై వాటిని పక్కన పెట్టేయండి. ఎందుకంటే.. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇవి తింటే జుట్టు, చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. నూడుల్స్ తయారీలో నూనెను ఎక్కువగా వాడతారు. అంతేకాక కార్బో హైడ్రేడ్స్ ఎక్కువగా ఉండుట వలన శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహానికి కారణం అవుతాయి. 
 
ఇందులోని మసాలాలు, గ్లుటామేట్, ఉప్పు, మోనోసోడియం రక్తపోటుకు కారణమవుతుంది. మోతాదుకు మించి సోడియం తీసుకోవడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. వాటినిలోని హానికరమైన పదార్థాల కారణంగా మెటబాలిజం రేటు తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
 
మనం ఎక్కువ నూడుల్స్‌ తింటే జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అందుకే మోతాదుకు మించి నూడుల్స్ తీసుకోకూడదు. తినాలనిపిస్తే మాసానికి ఒకసారి కూరగాయలు, నాన్ వెజ్‌లతో తయారైన నూడుల్స్ తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.