గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (13:52 IST)

మామిడి పళ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో విరివిగా లభించే మామిడిపండ్లు తింటే చాలా మంచిది. ఒక్కో మామిడి పండు ఒక్కోరకమైన రుచిని కలిగిఉంటాయి. అందుకే దేశ విదేశాల్లోను మామిడిని ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి తింటుంటారు.

ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో విరివిగా లభించే మామిడిపండ్లు తింటే చాలా మంచిది. ఒక్కో మామిడి పండు ఒక్కోరకమైన రుచిని కలిగిఉంటాయి. అందుకే దేశ విదేశాల్లోను మామిడిని ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి తింటుంటారు. మన దేశంలో కూడా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్యులు.
 
ఎందుకంటే మామిడిపండ్లలో కాలరీలు అధికంగా ఉంటాయి. ఒక మామిడి పండు తింటే 135 కాలరీలు లభిస్తాయి. ఒకేసారి మామిడి పండ్లను తింటే ఆటోమేటిక్‌గా బరువు పెరిగిపోతారట. వ్యాయామం తక్కువగా చేసేవారికి మామిడి కష్టాలు తప్పవంటున్నారు వైద్యులు. రోజూ అరగంట పాటు వ్యాయామం చేసేవారు మాత్రమే మామిడికాయలు తినాలట. 
 
మామిడిపండ్లలో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు వీటికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మామిడి పండ్లు కార్బైట్ రసాయనం ద్వారా కృత్రిమ పద్ధతిలో మగ్గపెడుతున్నవే. 
 
వీటిని ఎక్కువగా తింటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. సరిగ్గా మాగని పండ్లు తినడం వల్ల అజీర్తి సమస్య వస్తుందట. పొట్టలో మంట, సరిగ్గా జీర్ణం కాని సమస్యలతో బాధపడక తప్పదట. పచ్చిమామిడిని ఎంత తక్కువగా తింటే అంత మంచిదట. విపరీతంగా మామిడి పండ్లను తింటే చర్మ ఎలర్జీ, దురద, సెగ గెడ్డలు వంటి సమస్యలు ఏర్పడతాయట. కాబట్టి మామిడిపళ్లు తీయగా వున్నాయి కదా అని అదేపనిగా తినకూడదని తెలుసుకోమంటున్నారు.