మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 17 జులై 2017 (18:15 IST)

ముక్కు పుటాలు అదిరే గ్రిల్డ్ చికెన్, మటన్... తింటే?

నాన్‌వెజ్ అనగానే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇక హోటళ్లలో గ్రిల్డ్ చేస్తూ ముక్కు పుటాలను అదరగొడుతూ సువాసన వెదజల్లే చికెన్, మటన్ పీస్‌లను తినేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. మేక, కోడి, చేపలను గ్రిల్డ్

నాన్‌వెజ్ అనగానే చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇక హోటళ్లలో గ్రిల్డ్ చేస్తూ ముక్కు పుటాలను అదరగొడుతూ సువాసన వెదజల్లే చికెన్, మటన్ పీస్‌లను తినేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. మేక, కోడి, చేపలను గ్రిల్డ్ చేసి తినడం ఏమంత ప్రయోజనం కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల వాటిల్లో హెటిరో సైకిలిక్ అనిమీస్ అనేవి జనిస్తాయి. వీటికి కేన్సర్ కలిగించే తత్వం ఎక్కువ. 
 
వయసు పైబడిన వారిలో అయితే ఈ గ్రిల్డ్ వంటకాల వల్ల అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్స్ ఉత్పన్నమై అవి ప్రొటీన్‌ను దెబ్బతీస్తూ కణజాలపు పనితనాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిడేట్స్ ఒత్తిడి పెరిగి అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలతో పాటు శరీర భాగాల్లో వాపు ఏర్పడవచ్చు. ఆ తర్వాత ఈ పరిణామాలు తీవ్రమై, గుండె జబ్బులకు దారితీస్తాయి. 
 
అంతేకాదు రక్త నాళాలు పెళుసుబారే అథిరోస్కెరోసిస్, మధుమేహం, కిడ్నీ జబ్బులకు దారి తీసే ప్రమాదం వుంది. బాయిల్డ్ లేదా గ్రిల్డ్ మాంసం, చేపల్లో ఇవి మరింత ఎక్కువగా వుంటాయి. ప్రత్యేకించి అధిక ఉష్ణోగ్రత వండిన వంటకాల్లో ఇవి మరీ ఎక్కువగా వుంటాయి. అందుకే అటు పూర్తిగా పచ్చిగానూ కాకుండా, ఇటు అత్యధిక ఉష్ణోగ్రతలోనూ కాకుండా మామూలు వంటకంగా చేసుకోవడమే ఎంతో ఉత్తమమని చెపుతున్నారు పరిశోధకులు.