Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిద్రలేచిన వెంటనే ఫోన్ ముఖం చూస్తున్నారా?

మంగళవారం, 25 జులై 2017 (11:34 IST)

Widgets Magazine
mobile phone

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటి పరికరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తద్వారా నేటి యువత ప్రకృతితో గడపడం కంటే టెక్నాలజీతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంతవరకు స్మార్ట్ ఫోన్లతో గడిపే వారి సంఖ్యే అధికంగా ఉంది. నిద్రలేచిన వెంటనే ఫోన్లు చేతుల్లోకి తీసుకోవడం, నిద్రలేచాక ఫోన్ ముఖం చూడటం చేస్తే... కంటికి దెబ్బ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా సాంకేతిక పరికరాలను ఉపయోగించడం ద్వారా మానసిక ఒత్తిడి తప్పదంటున్నారు. ఈమెయిళ్లూ, మెసేజ్‌లూ చూస్తూ కూర్చోవడంవల్ల సమయం తెలియకుండా పోతుంది. నిద్రలేచిన వెంటనే టీవీ లేదా కంప్యూటరు ముందు కూర్చునే ప్రయత్నం వద్దు. దానివల్ల ఒక్క పనీ పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. బదులుగా కనీసం ఇరవై నిమిషాలైనా వ్యాయామం చేసి చూడండి. అందుకే లేవగానే కాసేపు ప్రశాంతంగా గడపండి. మొక్కల్ని చూడండి. నచ్చిన సంగీతం వినండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయడం వల్ల రోజంతా మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. 
 
అలారం మోగుతున్నా మరికాసేపు నిద్రించడం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తే చిరాకు మొదలై.. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. అందుకే ఎన్ని గంటలు నిద్ర పోవాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. ఆ ప్రకారం అలారం మోగగానే నిద్రలేవండి. నిద్రలేచిన వెంటనే కాళ్లూ, చేతుల్ని సాగదీసే స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తే శరీరం ఉత్సాహంగా మారుతుంది.


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మధ్యాహ్నం 2 గంటలలోపు తింటే బరువు తగ్గుతారట...

చాలామంది బరువు తగ్గేందుకు డైటింగ్‌ల పేరుతో కడుపు కాలుస్తుంటారు. మహిళలు అయితే ఉపవాసాల ...

news

సొరకాయ గింజలు - జీలకర్ర మిశ్రమాన్ని అన్నంలో తీసుకుంటే...

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం ...

news

దాల్చిన చెక్క పొడిని మరిగిన నీటిలో కలిపి తాగితే...

టైప్ 2 మధుమేహంతో బాధపడేవారిలో షుగర్ లెవల్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా ...

news

దాల్చిన చెక్క పొడి కషాయాన్ని బాలింతలు తాగితే...

లవంగాలు, దాల్చిన చెక్క పొడిని రోజూ అర టీ స్పూన్ ఆహారంలో చేర్చుకుంటే అజీర్తిని దూరం ...

Widgets Magazine