1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (17:21 IST)

బ్రాయిలర్ చికెన్ తింటున్నారా? వంధ్యత్వం తప్పదు.. జాగ్రత్త సుమా!

వంధ్యత్వంతో ఇబ్బంది పడే పురుషులు బ్రాయిలర్స్ కోడి మాంసాన్ని తినడం మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వంధ్యత్వం అనేది పురుషులు తీసుకునే ఆహారంపై వుందని, ఆహారపు అలవాట్లు కూడా వంధ్యత్వానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుషులు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయడం.. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, ముఖ్యంగా బ్రాయిలర్ కోడి మాంసంతో తయారైన వంటకాలను లాగించడం చేస్తుంటారు. 
 
కానీ బ్రాయిలర్ చికెన్ తినే పురుషుల్లో వంధ్యత్వానికి చాలామటుకు అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ చికెన్‌తో తయారైన చికెన్ 65, తండూరి చికెన్, గ్రిల్ చికెన్, చిల్లీ చికెన్, బోన్ లెస్ వంటివి చాలా వెరైటీలుంటాయి. వీటిని రుచిగా వుందని లాగిస్తే.. వీర్యవృద్ధి వుండదని, వీర్య లోపం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా స్వల్ప కాలంలోనే బ్రాయిలర్ కోళ్లను పుష్టిగా పెంచేస్తున్నారు. 
 
ఇలా ఇంజెక్షన్ల ద్వారా పెరిగిన చికెన్‌ను తీసుకోవడం ద్వారా వంధ్యత్వం తప్పదు. మహిళల్లోనూ ఈ సమస్య వుంటుంది. మహిళల్లో నెలసరి సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే బ్రాయిలర్ కోళ్ల కంటే.. నాటుకోడిని తింటే ఇలాంటి సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే బ్రాయిలర్ కోళ్లకు చెందిన కోడిగుడ్లను తీసుకోకపోవడం కూడా మంచిదే. 
 
ఇవి కూడా ఇంజెక్షన్ల ద్వారానే బ్రాయిలర్ కోళ్ల శరీరంలో ఏర్పడుతున్నాయి. అలాంటి కోడిగుడ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి బలం చేకూరడం కాదు కదా.. అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.