డయాబెటిస్ పేషెంట్లకు బెల్లం మంచిదా?

గురువారం, 30 నవంబరు 2017 (12:23 IST)

jaggery

బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు చక్కెర కంటే బెల్లాన్ని వాడటం మంచిదని కొందరు అంటారు. నిజానికి బెల్లం ఒంట్లోని ఫ్రీ రాడికల్స్‌ను హరిస్తుంది. ఫలితంగా ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలోని కార్బొ హైడ్రేట్స్ వల్ల తక్షణ శక్తి సమకూరుతుంది. బెల్లంను డయాబెటిస్ పేషెంట్లు వాడొచ్చునని వైద్యులు చెప్తున్నప్పటికీ.. ఇందులో కెలరిఫిక్ విలువ ఎక్కువ. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లాన్ని ఎక్కువగా వాడటం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
పంచదారతో పాటు తీపిదనం అధికం వున్న ఆహార వస్తువులను మధుమేహ వ్యాధిగ్రస్థులు దూరంగా వుంచాలి. బెల్లంలో సూక్రోస్ అధికంగా వుంటాయి. అంతేగాకుండా పంచదార, ఐరన్, మినరల్స్, సాల్ట్ వుంటాయి. ఇవన్నీ రక్తంలోని చక్కెర స్థాయులను పెంచేస్తాయి. తద్వారా అవయవాలకు మేలు జరగదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శ్వాసకోసవ్యవస్థనూ, జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అందుకే ఇది మంచి హెల్త్ క్లెన్సర్ అంటారు. ఇది కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా వుండటంతో రుతు సమస్యలతో బాధపడే మహిళలు బెల్లంతో చేసిన పల్లీపట్టి వంటివి తినమంటారు. మహిళల్లో రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి బెల్లం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిపై మరింత చదవండి :  
Jaggery Good Diabetic Patient Sugar Sucrose Immunity

Loading comments ...

ఆరోగ్యం

news

ఫుడ్‌ పాయిజనింగ్ అయిందా.. ఇలా చేయండి?

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతో పాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని ...

news

భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు ...

news

ఆ కారణంగానే భారతీయులకు గుండె జబ్బులు

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు ...

news

ఇలా భోజనం చేస్తే వందేళ్ళు బతకడం గ్యారంటి...

ఈరోజుల్లో చాలామంది కార్యాలయాలకు, కాలేజిలకు, ఇతర అవసరాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా టైం లేక ...