గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 నవంబరు 2019 (21:32 IST)

కొత్తగా పెళ్లయి వెంటనే పిల్లలు వద్దనకుంటే ఏంటి మార్గం?

ఇపుడంతా భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనేస్తే వాళ్ల ఆలనాపాలనా చాలా కష్టం అవడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా కుదేలవుతుంది. అందుకని ఇపుడు చాలా యువ జంటలు పెళ్లి కాగానే పిల్లల్ని కనేందుకు కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. ఐతే అందుకు వేరే ఏవేవో పద్ధతులు పాటించి కొందరు సమస్యలు తెచ్చుకుంటుంటారు. అలా కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే గర్భ ధారణను నియంత్రించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
 
భాగస్వామితో మెన్సస్ ప్రారంభమైన 9వ రోజు నుంచి 17వ రోజు వరకూ శృంగారంలో పాల్గొంటే అవి అండం విడుదలయ్యే రోజులు కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. మెన్సస్‌కు ముందు 8 రోజులు, మెన్సస్ తర్వాత 18వ రోజు నుంచి 28వ రోజు వరకూ పాల్గొంటే ప్రెగ్నన్సీ రాదు. మొదటి 8 రోజులు మెన్సస్ అయిన తర్వాత 11 రోజులు సేఫ్ పీరియడ్‌గా చెప్పవచ్చు. 
 
ఈ పద్ధతి కేవలం కేవలం 28 రోజులకు ఒకసారి సక్రమంగా మెన్సస్ అయ్యేవారికి మాత్రమే. అలాకాక కొందరు 21 రోజులకు, మరికొందరు 30 రోజులకు, ఇంకొందరు35, 38 రోజులకు అవుతుంటారు. అటువంటివారు ముందుగా అండం విడుదల ఎప్పుడవుతుందో తెలుసుకుని దాని ప్రకారం పాల్గొనాలి.