శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (20:19 IST)

పనస తొనలను తేనెలో రంగరించి తింటే..?

పనస పండు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిదా. వయస్సు తక్కువగా కనిపించాలంటే పనసపండు తినాలా. చర్మ సౌందర్యం పెరగాలన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా పనస పండు ఒక్కటే మార్గమంటున్నారు వైద్య నిపుణులు. పనసను తేనెలో కలిపి తీసుకుంటే కావాల్సినంత విటమిన్లు శరీరానికి అందుతాయట. 
 
పనసపండులోని తియ్యదనం, పనస కూరగాయలోని కమ్మదనం ఎంత చెప్పినా తక్కువేనంటారు ఆహారప్రియులు. అసలు పనసతో ఏ వంట చేసినా అమోఘమే. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. హైఫైబర్ గుణాలు అధికంగా ఉండే పనసపండు తింటే అనారోగ్యం అన్నమాట వినబడదు. ప్రతిరోజు ఒక్క పనస పండు తింటే చాలు అసలు వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. 
 
ఎముకలు బలం ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఎముకలు వీక్‌గా ఉంటే శక్తిహీనత ఉన్నట్లే. చర్మం ముడతలు పడి చిన్న వయస్సులోనే పెద్ద వయస్సువారిగా కనిపించడం అనీమియా వంటి సమస్యలను దూరం చేసే గుణం పనసపండులో ఉందట. అంతే కాదు అంటువ్యాధులను దూరం చేసే గుణం పనసలో కావాల్సినంత ఉందంటున్నారు వైద్యులు.
 
పనసతొనలను తేనెలో రంగరించి తింటే మెదడు నరాల బలపడటమే కాదు.. చురుగ్గా పనిచేశాయట. వాత, పిత్త వ్యాధులు అసలు దరిచేరవట. ఎ విటమిన్ శరీరానికి పుష్కలంగా అందించడంతో పాటు క్యాన్సర్ కారకాలను నిర్మూలించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న అద్భుతమైన కాయ పనసకాయ. అంతేకాదు కంటిచూపుకు కూడా బాగా పనిచేస్తుంది.