శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 23 మే 2019 (14:31 IST)

బరువు తగ్గాలంటే.. జాగింగ్ చేయడం ఎంతో బెటర్

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఫిట్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌లకు వెళతారు, బరువులు ఎత్తి మరీ వ్యాయామం చేస్తారు. ఇలా చేయడం కంటే జాగింగ్ చేయడం ఎంతో ఉత్తమం అని డాక్టర్లు చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లలేని వారు జాగింగ్‌కి వెళితే మంచి ప్రయోజనం ఉంటుంది. కొంత మంది ఉదయం పూట జాగింగ్‌కి వెళితే మరికొంత మంది సాయంత్రం పూట జాగింగ్‌కి వెళతారు. 
 
అయితే ఎప్పుడు జాగింగ్‌కి వెళితే మరింత ప్రయోజనం ఉంటుందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దీనిపై కాలిఫోర్నియా, ఇజ్రాయిల్ యూనివర్శిటీల పరిశోధకులు రీసెర్చ్ చేసారు. దీని కోసం ఎలుకలను వాడుకున్నారు. ఉదయం కంటే సాయంత్రం జాగింగ్‌కి వెళితే మేలని తేల్చారు. ప్రయోగంలో భాగంగా ఎలుకలను ట్రెడ్‌మిల్‌పై కూర్చోబెట్టి వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఎక్సర్‌సైజ్‌లు చేయించారు. 
 
ఆ తర్వాత వీటి చురకుదనాన్ని పరీక్షించారు. ఉదయం జాగింగ్ చేసిన వాటికంటే సాయంత్రం జాగింగ్ చేసిన ఎలుకలు 50శాతం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విధానం మనుషులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
సాయంత్రం సమయంలో జాగింగ్ వంటి ఎక్సర్‌సైజులు చేస్తే మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. ఉదయం జాగింగ్ చేసే సమయం లేకపోతే మానివేయకుండా సాయంత్రం సమయాన్ని కేటాయించి జాగింగ్ చేయండి. అప్పుడు ఉత్సాహం, ఫిట్‌నెస్ మీ స్వంతం అవుతాయి.