మంగళవారం, 19 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:12 IST)

జ్యూసర్లు వాడే బ్లేడుతో పండ్లలోని పోషకాలు మటాష్.. ఫ్రెష్ జ్యూసులొద్దు.. పండ్లే ముద్దు..

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకా

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, పీచుపదార్థం మొదలైనవి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జ్యూసర్లలో ఉండే బ్లేడు ద్వారా అది వేగంగా తిరగడం ద్వారా అత్యధిక వేడి ఉత్పన్నమై, పండులోని పోషకాలను నశింపజేస్తుంది.
 
ఇలా జ్యూసర్లో తయారుచేసిన జ్యూస్‌లను వెంటనే తాగేయాలి. నిల్వ ఉంచకూడదు. గాలిలోని ఆక్సిజన్‌ తగిలితే వీటిలోని సి విటమిన్‌ త్వరగా ఆవిరైపోతుంది. అందుకే రోజుకు ఒక పండును తీసుకోవడం చేయాలి. సీజన్‌లో దొరికే పండ్లను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించకుండా సూప్‌లా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది.