బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (00:23 IST)

కందగడ్డలో ఏముందో తెలుసా? (Video)

కందలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. అంతేకాకుండా కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాక ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
చిన్న కందగడ్డ ద్వారా దాదాపు మన శరీరానికి 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది. వీటిని తినడం వల్ల ఒబెసిటి, షుగర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది.
 
కంద చంటి పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి మేలు చేస్తుంది. గర్భిణులకు చేసే మేలు అంతాఇంతా కాదు. పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.
 
పైల్స్‌తో బాధపడేవారు కందని ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. లేత కందకాడలని శుభ్రంగా కడిగి పులుసుగా చేసుకొని తినడం వల్ల డయేరియాను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆకలిని పెంచుతుంది. మూల వ్యాధిని తగ్గిస్తుంది.
 
కంద దేహ పుష్టిని కలిగిస్తుంది. అన్నింటికి మించి పురుషులలో వీర్యపుష్టిని కలగచేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.